Site icon NTV Telugu

Ritu Varma: ముద్దు విషయంలో నాకు హద్దులు లేవు : రీతూ వర్మ

February 7 2025 02 24t094801.879

February 7 2025 02 24t094801.879

కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రీతూ.. రీసెంట్ గా ‘మజాకా’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ద‌ర్శకుడు త్రినాధరావు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవ‌రి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వూలో పాల్గొంటున్నారు.దీంతో రీసెంట్‌గా రీతూ వర్మ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..

Also Read: AR Rahman: విడాకులు వాపస్..గుడ్ న్యూస్ చెప్పిన సెలబ్రెటి జంట..!

రీతూ మాట్లాడుతూ.. ‘కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.  కానీ ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావడం లేదు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదు అని చాలా మంది దర్శకులు నా ముఖం చూసి వారే డిసైడ్ అయిపోతున్నారు. ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావడం లేదనుకుంటా’ అని రీతూ చెప్పుకొచ్చింది. అలాగే ఇక గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘స్వాగ్’ సినిమా గురించి రీతూ స్పందించింది.. ‘మేం ఆ సినిమా చేసేటపుడే అందరికీ నచ్చే సినిమా కాదని అనుకున్నాం. ఒక వర్గమే దీనికి కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆ కథలోని డెప్త్ చాలా మందికి అర్థం కాలేదు. ఈ విషయంలో నాకు బాధ లేదు. అలాంటి కథలో నటించినందుకు సంతృప్తిగా ఉంది. నటిగా నాకు అది స్పెషల్’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version