ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ 2020లో ఇప్పటికే బిగ్ బాస్-4 కంటెస్టెంట్ దివి స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మేల్ క్యాటగిరీలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్థానం సంపాదించుకోవడం విశేషం. బిగ్ బాస్-4లో కంటెస్టెంట్ గా వచ్చిన అఖిల్ సార్థక్ ‘2020 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ’గా నిలిచాడు. ఈ విషయాన్నీ అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకున్నాడు. ఇది కేవలం అభిమానుల వల్లే సాధ్యమైందని, ముఖ్యంగా తనకు సపోర్ట్ చేసిన అమ్మాయిలు అందరికీ ఆయన థాంక్స్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇది జరిగితే బాగుంటుందని అనుకున్నాను అని, ఇప్పుడు అలాగే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అంటూ అందరికి కృతజ్ఞతలు చెప్పాడు అఖిల్. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్-4లో అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. మోనాల్ తో ప్రేమాయణం ఉన్నట్లుగా కనిపించడంతో హౌస్ ఉన్నవారందరికన్నా వీరిద్దరే హాట్ టాపిక్ గా ఉండే వారు.
A post shared by ???????????? (@akhilsarthak_official)