Site icon NTV Telugu

Huma Qureshi’ :పార్కింగ్ వివాదంలో హీరోయిన్ సోదరుడి హత్య..

Huma Qureshi Cousin Murde

Huma Qureshi Cousin Murde

ఢిల్లీ హృదయభాగంలో చోటుచేసుకున్న ఓ పార్కింగ్ వివాదం, ప్రాణాంతక ఘ‌ట‌న‌గా మారి బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన చిన్న పార్కింగ్ వివాదం దారుణ హత్యకు దారితీసింది. బాలీవుడ్ నటి మహారాణి ఫేమ్ హుమా ఖురేషీకి కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ (42) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేసిన ఇద్దరు వ్యక్తులను పక్కకు తరలించమని కోరిన ఆసిఫ్, వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తగువు క్షణాల్లో ఫిజికల్‌గా మారి, నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆసిఫ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, హత్య కు సంబంధించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version