NTV Telugu Site icon

Daaku Maharaaj : డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకు భారీ ఏర్పాట్లు

Daaku

Daaku

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వహ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ రోల్ లో నటించి మెప్పించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య మాస్ యాక్షన్ కు విశేష స్పందన లభించింది.

Also Read : KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్

బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈసినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 56 కోట్లు రాబట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి వారం ముగిసే నాటికి రూ. 150 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుక నిర్వహించేనుదుకు ఏర్పాట్లు చేస్తుంది. వాస్తవంగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయలసీమ అనంతపురంలో జరగాల్సి ఉంది. అందుకోసం భారీ ఎత్తున  ఏర్పాట్లను కూడా చేసారు మేకర్స్. కానీ అనివార్య కారాణాల వలన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేశారు. కాగా ఇప్పుడు విజయోత్సవ వేడుకను అదే అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 వ తారీఖున అనంతపురంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన క్రాకర్స్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన బోతున్నట్టు తెలుస్తోంది.