Site icon NTV Telugu

Hrithik Roshan : హైకోర్ట్‌‌ను ఆశ్రయించిన హృతిక్ రోషన్..

Hruthik Roshan

Hruthik Roshan

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతివల్ల వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు. హృతిక్ తన ఇమేజ్, వాయిస్, ఫోటోల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిటిషన్‌లో తనకు తెలిసి తెలియని వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు.

Also Read : Kiran Abbavaram : ఓజీపై మాట్లాడకపోవడం వెనుక కారణం ఇదే.. కిరణ్ అబ్బవరం

ఇలాంటి సందర్భాలు గతంలో ఇతర స్టార్‌లతో కూడా చోటుచేసుకున్నాయి. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి సెలబ్రిటీలు కూడా హైకోర్టులో పిటిషన్ చేసి, వారి పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనధికారికంగా వాడకుండా నిషేధించే ఉత్తర్వులు పొందారు. అలాగే, బాలీవుడ్‌ సింగర్ కుమార్ సాను కూడా తన వాయిస్‌ను AI ద్వారా అనుకరిస్తున్నారని, తన హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూడా తన హక్కులను రక్షించుకోవడానికి బాంబే హైకోర్ట్‌లో న్యాయవిధానాలు ప్రారంభించారు.

Exit mobile version