NTV Telugu Site icon

Rajinikanth: రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?

Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య రావడంతో పొట్ట కింది భాగంలో వాపు వచ్చింది, దీంతో రజనీని ఆస్పత్రిలో చేర్చారు. ఇందుకోసం ఆయన కడుపులో స్టెంట్ అమర్చారని, స్టెంట్ అమర్చిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వస్తున్నాయి. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్‌ను ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. రజనీకాంత్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సెక్యూర్డ్ వాతావరణంలో వెళ్లాలి.

Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్

రజనీకాంత్‌కి ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరగడంతో.. చాలా త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. రజనీకాంత్‌ను రెండు మూడు రోజుల పాటు వైద్యులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తి శారీరక పరీక్షలు నిర్వహించి, 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా.. ఈ సమాచారాన్ని వైద్యులు ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్ కూడా నటిస్తున్నారు. కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రజనీ ఆరోగ్యం కుదుటపడే వరకు షూటింగ్‌లో పాల్గొనడం లేదని అంటున్నారు.

Show comments