Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంకా చోప్రా లైనప్‌లో ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ బిగ్ ప్రాజెక్ట్ చేరింది… అదే ‘బ్లూఫ్లై’. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోతో కలిసి ఆమె నటించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిమ్రోడ్ అంటాల్ డైరెక్ట్ చేయనున్నాడు. కాంగో బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో సీక్రెట్ మిషన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌తో పాటు హై యాక్షన్‌లో ప్రియాంక కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతోంది.
హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో పాటు ప్రియాంకా ఇండియన్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టింది. S.S. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంకా కీలక పాత్రలో నటిస్తోంది. ‘మందాకిని’ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. గ్లోబల్ వైడ్ ట్రావెల్ చేసే కథ, రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు–ప్రియాంకా కాంబినేషన్ ఇవన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అంటే హాలీవుడ్లో గ్లోబల్ స్టార్‌గా ఉన్న ప్రియాంకా ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి కూడా గ్లోబల్ స్కేల్లోనే తన జర్నీ కంటిన్యూ చేస్తోంది. ప్రియాంకా కెరీర్‌ను చూస్తే… ఒక్క సినిమా తో వచ్చిన గ్లోబల్ క్రేజ్ కాదు. ‘సీటాడెల్’లాంటి సిరీస్ లతో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు మరింత చేరువైన ప్రియాంకా… ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంటూ వరసగా డిఫరెంట్ జానర్స్‌ను ఎంచుకుంటుంది. సేమ్ టైమ్ ఇండియన్ సినిమాను కూడా వదిలిపెట్టకుండా రాజమౌళి లాంటి దర్శకుడితో భారీ ప్రాజెక్ట్ తో పాటు , ఫరాన్ అక్తర్ చేయబోయే జీలే జరా, హృతిక్ రోషన్ కాంబోలో క్రిష్ 4 లాంటి బాలీవుడ్ సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. మరి ఈ వరస బిగ్ ప్రాజెక్ట్స్ ఆమెను గ్లోబల్ స్టార్‌గా మరింత ఎత్తుకు తీసుకెళ్తాయా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..