NTV Telugu Site icon

Hot Star : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓనమ్ బ్లాక్ బస్టర్

Kishkinda Kandam

Kishkinda Kandam

మలయాళ హీరోలలో ఒకరు ఆసిఫ్‌ అలీ . విభిన్న కథలతో, సరికొత్తా కథాంశంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆసిఫ్‌ అలీ . కాగా ఈ ఏడాది కేరళ ముఖ్య పండుగ ఓనమ్ ఫెస్టివల్ కానుకగా కిష్కింద కాండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆసీఫ్ అలీ. సూపర్ హిట్ టాక్ తో పాటు ఈ ఏడాది మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన సినిమాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుద‌లై హిట్ టాక్ తో పెద్ద విజ‌యాన్ని సాధించింది. సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన కిష్కింద కాండం దాదాపు రూ. 90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

Also Read : Sivakarthikeyan : 300 వందల కోట్ల మైలురాయి అందుకున్నఅమ’రన్’

థియేటర్స్ లో వందరోజుల రన్ కంప్లైట్ చేసుకుంది కిష్కింద కాండం.ఆసిఫ్ అలీ, అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప‌స్ల్ హాట్ స్టార్ లో నవంబరు 19న స్ట్రీమింగ్ కు తీసుకు వహ్చింది. వినూత్నఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిమిమా ఇంటర్వెల్ ట్విస్ట్ లతో తర్వాత ఏమి జరుగుతుందో అనే టెన్షన్ తో టైట్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. నాలుగు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయి ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా కిష్కింద కాండం రికార్డ్ సెట్ చేసింది. కేవ‌లం 7 కోట్లు బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బయ్యర్స్ కు లాభాల పంట పండించి ఓనం బ్లాక్ బస్టర్ విన్న గా నిలిచింది.

Show comments