NTV Telugu Site icon

Prabhas: ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్.. ముగ్గురు డైరెక్టర్స్ లాక్?

Prabhas

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్‌గా మరే ఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజ సాబ్’, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే కెజీయఫ్, కాంతార, సలార్ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేశాడు ప్రభాస్. అయితే.. ఈ మూడు సినిమాల దర్శకులు ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే.. ముగ్గురు దర్శకులు దాదాపు లాక్ అయ్యారనే చెప్పాలి. సలార్ 2 సినిమాను హోంబలే సంస్థనే నిర్మిస్తున్నప్పటికీ.. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

China: పది రోజులు మంచులో చిక్కుకున్న యువకుడు.. ఆకలి బరించలేక టూత్ పేస్ట్ తిని..

ఇక హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమాకు ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. బ్రహ్మరాక్షస్‌గా రానున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో సినిమా వచ్చేసి లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ప్రభాస్, లోకేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో హోంబలే వారు నిర్మించనున్నట్టుగా టాక్. ఈ లెక్కన.. హోంబలే సంస్థలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ లాక్ అయ్యారనే చెప్పాలి. ఇక ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయని గతంలోనే ప్రకటించారు హోంబలే వారు. ఏదేమైనా.. ఒకసారి డార్లింగ్ చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే.. టాలీవుడ్‌కు ధీటుగా సొంతంగా ప్రభాస్ ఒక ఫిల్మ్ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు ఉంది.