Site icon NTV Telugu

Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !

Paddington In Peru,dougal Wilson

Paddington In Peru,dougal Wilson

అనిమేషన్ మూవీస్ ఎన్ని వచ్చినప్పటికి. కొని జంతువుల సినిమాలు మాత్రం అసలు బోర్ కొట్టవు. ఎన్ని రకాలుగా వస్తే అన్ని రకాల సినిమాలు చూస్తునే ఉంటాం. కానీ 2021లో వచ్చిన ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ , 2017 లో వచ్చిన ‘పాడింగ్టన్ 2’ వంటి చిత్రాలు చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఇక పాడింగ్టన్ సిరిస్ నుండి మూడో భాగం రాబోతుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా 2025 ఏప్రిల్ 18న భారతీయ సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ ప్రసిద్ధ కుటుంబ వినోదం.. మూడవ భాగం నుండి ట్రైలర్‌ విడుదల చేశారు.

Also Read: Puri Jagannadh : విజయ్‌ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..

కాగా ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సాహసం, రహస్యాలతో నిండి, ప్రేమగల ఎలుగుబంటి అత్త లూసీ అలాగే ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, అస్థిర నదులు, పురాతన శిధిలాల గుండా ప్రయాణిస్తుంది. కాగా మొదటి రెండు చిత్రాల కంటే ఈ మూడో భాగం మరింత ఇంట్రెస్ట్ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

 

Exit mobile version