NTV Telugu Site icon

HIT : ‘HIT – The 3rd Case’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా..?

Untitled Design (5)

Untitled Design (5)

వాల్ పోస్టర్ బ్యానర్ పై ఎన్నో విభిన్న సినిమాలు నిర్మిచాడు నేచురల్ స్టార్ నాని. ఆ బ్యానర్ లో శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన HIT : ఫస్ట్ కేస్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన HIT : 2  కూడా హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో భాగంగా HIT : 3 తీసుకువస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read : KrishnaManineni : ‘100 డ్రీమ్స్ ఫౌండేషన్’ను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది.