Site icon NTV Telugu

Kantara Chapter1 : ఇదేం క్రేజ్ బాబోయ్.. మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..

Kantara

Kantara

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లోను మంచి వసూళ్లు రాబడుతోంది.

Also Read : Akkineni King : అక్కినేని నాగార్జున100వ చిత్రం ‘లాటరీ కింగ్’

అయితే కర్ణాటకలో ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. కర్ణాటకాలో ఇటీవల చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆక్యుపెన్సీ లేక మూసేసారు. కన్నడలో స్టార్ హీరోలు సినిమాలు ఏవి లేకపోవడం ఉన్న సినిమాలు అంతగా రెవెన్యూ రాబట్టలేక పోవడంతో స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేక కొద్దీ నెలలుగా మూసేసారు. కానీ ఇప్పడూ ఆ థియేటర్స్ సైతం తలుపులు తెరిపించింది కాంతార చాఫ్టర్ 1. మారుమూల పల్లెటూర్లో కూడా మూతపడిన థియేటర్స్ ను కూడా కాంతార చాఫ్టర్ 1 కోసం తిరిగి ఓపెన్ చేసారు. రిలీజ్ రోజు నుండి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ వసూళ్లు తెచ్చిపెడుతోంది. మరో ఏడాది పాటు థియేటర్స్ ను రన్ చేసేలా ఊరటనిచ్చింది కాంతార చాప్టర్ 1. దసరా సెలవులు ముగిసిన కూడా నేడు కర్నాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 7 కోట్ల మార్క్ అందుకుని సాలిడ్ గా దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ నాటికి కర్నాటకల లో రూ. 80 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార చాప్టర్ 1.

Exit mobile version