High Court Comments on Kalki 2898 AD Ticket rates Hike: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుమారు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో సినిమా టికెట్ రేటు పెంచి అమ్ముకుంటామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఆ మేరకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కల్కి సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
Pawan Kalyan: మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం
10 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కల్కి సినిమాకి 14 రోజులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరినా ఇవ్వని న్యాయస్థానం, కల్కి సినిమా అని కాకుండా ప్రత్యేకంగా ఒక్కో సినిమాకి టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే అంశంపై విచారణ చేద్దామని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతి వాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.