పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం, యూకేలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతుండగా.. అభిమానులు సృష్టించిన హంగామా అంతర్జాలాన్ని కుదిపేస్తోంది. లండన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Fahadh Faasil: నా డ్రీమ్ జాబ్ అదే.. షాక్ ఇచ్చిన షికావత్
జులై 25న విడుదలైన ఈ చిత్రం లండన్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. తొలిరోజే పలు ప్రాంతాల నుండి వచ్చిన పవన్ అభిమానులు థియేటర్‌లో తనకిష్టమైన విధంగా కాన్ఫెట్టి (రంగు కాగితాలు) చల్లుతూ ఎంజయ్ చేశారు. అయితే విదేశీ థియేటర్లు కఠిన నిబంధనలకు లోబడి ఉంటాయి. కాన్ఫెట్టి వాడాలంటే ముందుగా థియేటర్ యాజమాన్య అనుమతి తీసుకోవాలి. కానీ అక్కడి అభిమానులు ఆ అనుమతి తీసుకోకుండానే సందడి చేయడంతో థియేటర్ సిబ్బంది తీవ్రంగా స్పందించారు. వెంటనే సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేసి, అల్లరి చేసిన వారిని హాళ్ల నుండి బయటకు పంపించారు.
ఇందుకు సంబంధించిన వీడియోల్లో .. ‘ఇది ఇండియా కాదు. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి. మీరు ఏదైనా చేయాలంటే ముందు అనుమతి కావాలి’ అని సిబ్బంది స్పష్టం చేశారు. దీనికి ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు ‘ఇలాంటి రూల్స్ పై ఎక్కడా బోర్డులు కనిపించలేదు’ అని వాదించారు . ఇక ఈ విషయం పై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు..“థియేటర్ సిబ్బంది సరిగ్గా స్పందించారు” అంటుంటే, మరికొందరు “అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇతరులకు అసౌకర్యం కలిగింది” అని విమర్శిస్తున్నారు. మొత్తనికి విదేశాల్లో అభిమానాన్ని వ్యక్తపరచడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ‘ఇది ఇండియా కాదు’ అనే మాట ఇప్పుడు ట్రెండింగ్ ట్యాగ్‌గా మారింది.
