Fahadh Faasil: నా డ్రీమ్ జాబ్ అదే.. షాక్ ఇచ్చిన షికావత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాషతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం వడివేలుతో కలిసి కామెడీ థ్రిల్లర్ మూవీ ‘మారీశన్’ లో నటించాడు. కాగా జూలై 25న అంటే నేడే ఈ చిత్రం విడుదల కూడా అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ తన జీవిత లక్ష్యం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
Also Read : Krithi Shetty : ఛాన్స్‌ల కోసం గ్లామర్ డోస్ పెంచేసిన బేబ్బమ్మ ..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఫహాద్ మాట్లాడుతూ.. ‘సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను బార్సిలోనాలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తాను. ఇది నేను సరదాగా చెప్పడం లేదు. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. జనాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇది నా డ్రీమ్ జాబ్. గతంలో కూడా బార్సిలోనా వెళ్లాను.. నాకు బాగా నచ్చిన ప్రదేశం అది. ఆ నగరం ఎనర్జీ, కల్చర్, మార్గాలు అన్నీ నా మనసును దోచేశాయి. అక్కడికి వెళ్లి డ్రైవర్‌గా పని చేయడం నాకు నిజంగా మంచి ఫీల్ ఇస్తుంది. ఈ విషయాన్ని నా భార్య నజ్రియాకు చెప్పా.. ఆమె కూడా సపోర్ట్ చేసింది. ఇండస్ట్రీ లో రిటైర్ మోంట్ అయిన తర్వాత, నేను అక్కడికి వెళ్లి డ్రైవర్‌గా సెటిల్ అవుతాను. స్పెయిన్ మొత్తం తిరుగుతూ ప్రజలను తిప్పుతుంటాను. ఈ విషయాన్ని నా భార్య నజ్రియాకు చెప్పా.. ఆమె కూడా సపోర్ట్ చేసింది’ అని తెలిపారు.
కానీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు ఓ సాధారణ ఉద్యోగాన్ని ‘డ్రీమ్ జాబ్’గా చెప్తే అది ఆశ్చర్యంగా ఉంటుంది. అతను పాపులారిటీకి పదిలంగా కాకుండా, జీవితంలో నిజమైన సంతృప్తిని వెతుక్కునే మనిషిగా కనిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?