కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా పదుకొనే, ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పింది. కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ తో వర్క్ ఇష్టం అని చెప్పగా.. జాన్వీ సైతం విజయ్ తో వర్క్ చేయాలనీ చెప్పింది. అదే విధంగా హీరోలు కూడా తమ ఫెవరేట్ హీరోయిన్లతో నటించాలని ఉందని చెప్తూ ఉండడం సహజం.
తాజాగా రాఖీ భాయ్ సైతం తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. కెజిఎఫ్ 2 సక్సెస్ ఇంటర్వ్యూలో యష్ కు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు..? ఎవరితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడగగా.. తడుముకోకుండా దీపికా పేరు చెప్పడం విశేషం. ఆమె నటన చాలా బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యష్ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి యష్ మనసులోని మాటను ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో చూడాలి.
