ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ మధ్య బీహార్‌లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుమారు 3 లక్షల మందికి పైగా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
Also Read : Tollywood : బాలీవుడ్ పై టాలీవుడ్ హీరోల డామినేషన్
అయితే ఈ పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ ఫై తమిళ్ హీరో సిద్దార్ధ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆయన నటించిన మిస్ యు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ‘ బీహార్ లోని పాట్నాలో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే, అదిపెద్ద విషయం కాదు, రోడ్ పై జేసీబీ వర్క్ చేస్తున్న కూడా ఎక్కువ మంది గుమిగూడతారు. బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం మ్యాటర్ కాదు. మీరు పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే, ప్రజలు గుమిగూడుతారు. ఒక బిర్యానీ, క్వార్ట్రర్ ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్ కు జనాలు విపరీతంగా వస్తారు అలా అని రాజకీయ పార్టీలు గెలుస్థాయా ” అని కామెంట్స్. ఈ నోటి దురుసు వల్లే ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న సిద్దార్ద్ సినిమాలు ఇప్పుడు చూసే వారు లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.