టాలీవుడ్ యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒక్కరు. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కెరీర్‌కి ప్లస్ అయ్యేలా గట్టి హిట్ మాత్రం అందుకోలేకపొయ్యాడు. ఇక నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన కిరణ్ తాజాగా ‘దిల్ రూబా’ మూవీతో మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వకరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు కిరణ్. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
Also Read: Women’s Day : మహిళ త్యాగం, ప్రేమ ఎనలేనివి..!
కిరణ్ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక బలంగా ఉండేది నాకు. అందులో భాగంగానే హీరో కావాలనుకున్నాను. కానీ నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం.రాయలసీమకు చెందిన వ్యక్తిని కావడంతో చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చాలా దగ్గరగా చూశాను ఒకవేళ నటుడిని కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని. మంచి, చెడు పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవ్వడం గొప్ప విషయం. అది నాకు నచ్చుతుంది.. అందుకే నాకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. అతి త్వరలోనే వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను. రాయలసీమ స్టైల్ ఆహారం ఇక్కడ అందరికీ అందించాలనుకుంటున్నా. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న. త్వరలోనే అనౌన్స్ చేస్తాను’ అంటూ కిరణ్ తెలిపారు.
