NTV Telugu Site icon

Karthikeya : ఆ విషయంలో నేనెప్పుడూ బాధ పడలేదు..

Karthikeya

Karthikeya

Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం కార్తికేయ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్  ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ  సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Read Also :Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం!

ఈక్ర‌మంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌,ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ఈ సినిమాలో యాక్షన్ ,లవ్ ,సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు వున్నాయి.దర్శకుడు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులోని ఎమోషన్స్ బాగా నచ్చాయని హీరో కార్తికేయ తెలిపారు.ఇదిలా ఉంటే హీరో కార్తికేయ నాని నటించిన గ్యాంగ్ లీడర్ ,అజిత్ హీరోగా నటించిన “వాలిమై” సినిమాలలో విలన్ గా నటించాడు.అయితే హీరోగా కెరీర్ సాగుతున్న సమయంలోనే విలన్ గా నటించడంపై కార్తికేయ స్పందించాడు.ఆవిషయంలో నేను ఎప్పుడు కూడ బాధ పడలేదు..గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారానే నేను అమెరికా ఆడియన్స్ కు చేరువయ్యాను.వాలిమై ద్వారా తమిళ్ లో మంచి గుర్తింపు లభించింది అని కార్తికేయ తెలిపాడు.

Show comments