AlluArjun : నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Mega Star : స్పీడు పెంచిన మాలీవుడ్ మెగాస్టార్
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
మధ్యంతర బెయిల్ ముగియడంతో ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు చేస్తూ, రూ. 50 వేల రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని,కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని షరతులు విధిస్తూ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు అల్లు అర్జున్. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇచింది. దాంతో పాటుగా అల్లు అర్జున్ కు విదేశాలకు వెళ్లేందుకు కూడా నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కోర్టు నేడు మినహాయింపునిస్తూ తీర్పు వెలువడించింది.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!