NTV Telugu Site icon

AlluArjun : నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..

Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Also Read : Mega Star : స్పీడు పెంచిన మాలీవుడ్ మెగాస్టార్

మధ్యంతర బెయిల్ ముగియడంతో ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు చేస్తూ, రూ. 50 వేల రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం  చేయకూడదని,కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని షరతులు విధిస్తూ నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు అల్లు అర్జున్. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇచింది. దాంతో పాటుగా అల్లు అర్జున్ కు విదేశాలకు వెళ్లేందుకు కూడా నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కోర్టు నేడు మినహాయింపునిస్తూ తీర్పు వెలువడించింది.

Show comments