Site icon NTV Telugu

‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’!

హాలీవుడ్ స్టార్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. డిస్నీ కామిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఖచ్చితంగా కథ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ‘టాయ్ స్టోరీ 4’ దర్శకుడు జోష్ కూలే ప్రస్తుతం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. ఆయన సారథ్యంలోనే స్కార్లెట్ జోహాన్సన్ మూవీ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆమె తన బ్యానర్ ‘దీస్ పిక్చర్స్’పై ఈ చిత్రాని నిర్మించనుంది. అయితే, స్కార్లెట్ సినిమాలో నటిస్తుందా లేదా ప్రొడ్యూసర్ గానే వ్యవహారిస్తుందా కూడా ఇంకా తెలియదు.
డిస్నీ సంస్థ కోసం స్కొర్లెట్ జోహాన్సన్ నిర్మిస్తోన్న తాజా చిత్రం… ముందుగా ‘జంగల్ క్రుయిజ్’ సినిమా విడుదలైన తరువాత ప్రాంభమవుతుందట. డిస్నీ మూవీ ‘జంగిల్ క్రుయిజ్’ జూలై 30న థియేటర్స్ కి వస్తోంది. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘బ్లాక్ విడో’ క్యారెక్టర్ ద్వారా పాప్యులర్ అయిన స్కార్లెట్ జోహాన్సన్ త్వరలో కొత్త సీక్వెల్ తో సూపర్ హీరోగా మన ముందుకు రానుంది. లెటెస్ట్ ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు…

Exit mobile version