Site icon NTV Telugu

Priyadarshi : జాతకం చెప్పబోతున్న ప్రియదర్శి.. మీ పెళ్లి ఎప్పుడో తెలుసుకోండి..

Untitled Design (8)

Untitled Design (8)

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

Also Read: Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..?

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో రానుంది ఈ చిత్రం” అని అన్నారు.

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ” మా సంస్థలో 15వ చిత్రమిది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’, ‘యశోద’ – హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.

Exit mobile version