ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమా థియేటర్లలో సందడి, ఆ సినిమాలో ముకుంద్ కులాన్ని చూపించకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. ఈ ఏడాది దీపావళికి విడుదలైన సినిమాల్లో అమరన్ ఒకటి. తమిళనాడుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ కులం గురించి సమాచారం ఈ సినిమాలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలను కొంతమంది వ్యక్తులు నిరంతరం లేవనెత్తుతుండగా, అలాంటి ప్రశ్నలకు రాజ్‌కుమార్ పెరియస్వామి స్పందించారు. శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమా విడుదలై వారం కూడా కాకముందే దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసింది.
Suriya Siva Kumar: సూర్యకు థియేటర్ల తలనొప్పి.. ఇదేం లాజిక్ !
ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన నటి సాయి పల్లవి నటించగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. శివకార్తికేయన్, సాయిపల్లవిల నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తుండగా, ముకుంద్ వరదరాజన్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని సినిమాలో ఎందుకు దాచిపెట్టారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలో ‘అమరన్’ సినిమా సక్సెస్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దీనిపై వివరణ ఇచ్చారు. ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్, ముకుంద్‌ను కుల గుర్తింపు లేకుండా తమిళుడిగా గుర్తించాలని కోరారు. అలాగే ముకుంద్ తనను తాను భారతీయుడిగా ప్రజెంట్ చేశాడని, అందుకే తన కమ్యూనిటీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఇది ముకుంద్ వరదరాజన్‌ను సెలబ్రేట్ చేసుకునే సినిమా అని.. అందుకే ఆ కులం పేరుతో విడతీయాల్సిన అవసరం లేదని అన్నారు.