సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి హేమ పోతన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 2013లో మిస్ హైదరాబాద్ కిరీటం హేమ సినీ ప్రయాణానికి పునాది వేసింది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హేమ, తన నటన ప్రతిభను పలు చిత్రాల్లో చాటుకున్నారు. ఆమె నటించిన సినిమాలలో 100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్ వంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది. ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, డాక్టర్లు సైతం చేతులెత్తేసేంత. కానీ హేమ ఓటమిని అంగీకరించలేదు.
ప్రస్తుతం హేమ ‘మదం’ అనే గ్రామీణ నేపథ్య చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కథలో భావోద్వేగం, నటనకు విశేషమైన అవకాశం ఉన్న ఈ సినిమా ద్వారా తన ప్రతిభను మరొక మెట్టుకు తీసుకెళ్లాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకపోయినా, హేమ తన ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడే స్వభావంతోనే వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ, తన ప్రయాణాన్ని సినిమాను మించిన కథలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ వర్ధమాన నటి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు.
