బాలీవుడ్ నాయిక, డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఇప్పుడు ప్రజా ప్రతినిధి కూడా. మధుర పార్లమెంట్ నియోజక వర్గం నుండి ప్రజలు ఆమెను పార్లమెంట్ కు పంపారు. కరోనా కష్టకాలంలో తన నియోజవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని హేమామాలిని చెబుతోంది. మధుర జిల్లా భ్రజ్ ప్రాంతంలో ఏడు ఆక్సిజన్ ఎన్స్ హాన్సర్ మిషిన్లను ఏర్పాటు చేశారు. అలానే గ్రామీణ మధుర ప్రాంతంలోనూ అతి త్వరలోనే ఆక్సిజన్ ఎన్ హాన్సర్ మిషిన్లు ఏర్పాటు చేస్తానని హేమమాలినీ హామీ ఇచ్చింది. తాజాగా ఏర్పడిన మిషన్లతో అక్కడ మరో అరవై ఆక్సిజన్ బెడ్స్ ను ఏర్పాటు చేయొచ్చునని స్థానిక అధికారులు చెబుతున్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి ఇలా ప్రజా ప్రతినిధులు సైతం చొరవ చూపడం అభినందించదగ్గ విషయమే!
మధుర వాసుల సేవలో డ్రీమ్ గర్ల్!
