స్టార్ హీరో ధర్మేంద్ర చనిపోయాడు అని చేసే ప్రచారం క్షమించరానిది అని ఆయన సతీమణి హేమమాలిని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని అన్నారు. “బాధ్యత కలిగిన ఛానెల్స్ బతికి ఉండి, చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా ప్రచారం చేయగలవు?” అని ఆమె ప్రశ్నించారు. “ఇది కచ్చితంగా అగౌరవపరచడమే, అలాగే ఇర్రెస్పాన్సిబుల్‌గా వ్యవహరించడమే” అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read : Dharmendra Death: మా నాన్న చనిపోలేదు.. చంపేయకండి !
“దయచేసి మా కుటుంబానికి గౌరవం ఇవ్వండి, మాకు కొంత ప్రైవసీ ఇవ్వండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
ధర్మేంద్ర ఈ ఉదయం 8:30 సమయంలో చనిపోయారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ధర్మేంద్ర మృతి అనే వార్తలు ఒకసారిగా తెర మీదకు వచ్చాయి. అయితే, అది నిజం కాదు అని తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆయన కుమార్తెలలో ఒకరైన ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “దయచేసి మా కుటుంబానికి కాస్త ప్రైవసీ ఇవ్వండి” అని ఆమె కోరారు. ఆమె పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ధర్మేంద్ర సతీమణి హేమమాలిని సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన భర్త చనిపోయాడు అంటూ చేస్తున్న ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని ఆమె పేర్కొన్నారు.
