Hebah Patel: మాక్ సూసైడ్ అనేది కొన్నేళ్ళుగా మన సమాజంలో ఎక్కడో అక్కడ జరుగుతున్నదే! కుటుంబ సభ్యులంతా కలిసి మాస్ హిస్టీరియాకు గురైనట్టుగా, ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటమో, లేదంటే కుటుంబంలోని ఓ వ్యక్తి ప్రభావానికి లోనై ఆత్మహత్యకు ప్రేరేపితులు కావడమో జరుగుతోంది. ఇలాంటి దుర్ఘటనలకు సంబంధించిన వార్తలను పేపర్లలో చదివి, న్యూస్ ఛానల్స్ లో చూసిన కొద్దిరోజులకు మర్చిపోతుంటాం. అయితే…. ఇంతటి దారుణానికి కుటుంబ సభ్యులు, అందులోనూ బాగా చదువుకున్న వ్యక్తులు ఒడిగట్టడం వెనుక ఎలాంటి కారణాలు ఉండొచ్చో చెప్పే చిత్రంగా ‘తెలిసినవాళ్ళు’ రూపుదిద్దుకుంది.
Read also: Monster Movie Banned Gulf Countries: గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్
సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి స్వీయ దర్వకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ ను మిక్స్ చేసి తీసిన ఈ సినిమాలో హీరోగా రామ్ కార్తీక్ నటించగా, అతని సరసన హీరోయిన్ గా హేబా పటేల్ నటించింది. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘శశివదనే’ పాటకు మంచి స్పందన లభించిందని, టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయని దర్శక నిర్మాత విప్లవ్ కోనేటి తెలిపారు. టీజర్ చూసిన కొంతమంది నిర్మాతలు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు. అలానే పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ అన్ని యూనిక్ గా ఉండటంతో, వాటిని గురించి సగటు ప్రేక్షకుడు కూడా మాట్లాడుకోవడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సినిమాను నవంబర్ నెలలో జనం ముందుకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రలను నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ పోషించారు.
Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
