NTV Telugu Site icon

బాలయ్య, అనిల్ రావిపూడి మూవీకి అత్యంత భారీ బడ్జెట్ ?

anil-ravipudi

యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.75 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టులలో ఒకటి. ఇక అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తన ట్రేడ్ మార్క్ కామెడీని, బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ ను ఎలివేట్ చేయనున్నారట. ప్రస్తుతం బోయపాటితో ‘అఖండ’ చిత్రం చేస్తున్న బాలయ్య తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి, బాలయ్య మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.