NTV Telugu Site icon

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

Jani Master

Jani Master

Heart Attack to Jani Master Mother BibiJan: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ కి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదు చేయడంతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడుకు జైలుకు వెళ్లినప్పటి నుంచి తల్లి బీబీ జాన్ బెంగతో ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తోంది. తాజాగా ఆమెకు గుండెపోటు రావడంతో నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్ ఐసీయూ చేర్చారు అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Ram Charna: అలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం

ఇక తన అత్తగారికి గుండెపోటు వచ్చిందని విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి అయేషా ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. మరోపక్క కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరింది.. జానీ మాస్టర్‌ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..

Show comments