Site icon NTV Telugu

Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..?

Untitled Design 2024 08 11t124605.390

Untitled Design 2024 08 11t124605.390

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి  అడుగుపెట్టాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Also Read: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని

ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.  ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్‌ను రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు .ఒక పాత్ర యంగ్ ఏజ్ యువకుడు మరియు రెండవ పాత్ర మధ్య వయస్కుడి ఏజ్ లో  అర్ధం వచ్చేలా చూపించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగే ఈ కథలో వరుణ్ తేజ్‌‌‌‌ నాలుగు విభిన్న గెటప్‌లలో దర్శనమిస్తాడని సమాచారం. ఈ  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అండర్‌డాగ్ నుండి ఓవర్‌లార్డ్ వరకు రెండు షేడ్‌లు చూపిస్తూ పైన ఇమేజ్ లో సిగార్ తాగుతూ కనిపించిన డౌన్ ఇమేజ్‌లో యవ్వనంగా, డాషింగ్‌గా మరియు గంభీరమైన లుక్ లో ఉన్నాడు వరుణ్. అతని డ్రెస్సింగ్ స్టైల్ మరియు హెయిర్ స్టైల్ పాతకాలపు వైబ్స్ ను గుర్తుకు తెస్తున్నాయి. నెరిసిన జుట్టుతో ధనవంతుడు మరియు వృద్ధుడిగా డబుల్ షేడ్స్ లో  అలరిస్తున్నాడు వరుణ్ తేజ్. టేబుల్ మీద తుపాకీని చూపిస్తూ ప్లే కార్డుల నుండి కింగ్ కార్డ్ డిజైన్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మట్కా ఫస్ట్ లుక్ వరుణ్ తేజ్ ను తన అభిమానులు ఎలా చూడాలనుకున్నారో మళ్లీ ఆ పాత్రల్లోకి వస్తున్నట్లు ఉంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version