Kareena – Aiswarya : బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?

Aishwarya Rai Kareena Kapoor

Aishwarya Rai Kareena Kapoor

బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ అండ్ కరీనా కపూర్ కెరీర్ ఫేడవుట్ దిశకు చేరుకున్నట్లేనా.. అంటే దాదాపు అవుననే అంటున్నారు. ఐషూకి ఆఫర్స్ లేకే బ్రాండ్ ఎండార్స్ మెంట్‌తో కాలక్షేపం చేస్తుంటే బెబో సినిమా అంటే మినిమం కలెక్షన్స్ రావడం కూడా కష్టమౌతుంది. కరీనా కపూర్ కెరీర్ చాలా ఏళ్లుగా డల్‌గా సాగుతోంది. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిన బెబో ఇప్పుడు తన మార్కెట్ కోల్పోయింది. ఇటీవల రిలీజైన ‘దాయ్రా’నే అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టరైంది. 55 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు.

ఇక అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలయ్యాక ఆచి తూచి సినిమాలు చేస్తున్న ఐశ్వర్యరాయ్ అప్పుడప్పుడైనా తళుక్కున మెరిసేది. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయలేదు. ‘పొన్నియన్ సెల్వన్2’ తర్వాత వెండితెరపై కనిపించలేదు. కేన్స్ ఉత్సవాలు లేదంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌తో టైమ్ పాస్ చేసేస్తోంది.. వీళ్లే కాదు ఈ జాబితాలో మరికొంతమంది సీనియర్‌ హీరోయిన్స్‌ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్‌ రావడం.. ఏజ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్స్ చేయకపోవడం కూడా ఐశ్వర్య అండ్ కరీనా లాంటి సీనియర్ బ్యూటీలకు ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. చేస్తే ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో రావాలి కానీ.. వీళ్లకు మార్కెట్ తగ్గిపోవడంతో అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో వచ్చిన ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ.. అప్పుడప్పుడు మెరుస్తున్నారు సీనియర్ భామలు.