Site icon NTV Telugu

akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?

Untitled Design (23)

Untitled Design (23)

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది.

అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌. తన మ్యూజిక్ తో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాడు తమన్‌. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ను దద్దరిల్లే సౌండ్ తో అపురూపంగా మలిచాడు తమన్‌. ఓవర్సీస్ లో అఖండ సౌండింగ్ కు తమ థియేటర్లు తట్టుకోలేకున్నాయి సౌండ్ తగ్గించి ప్రదర్శిస్తాం అని సూచనలు చేసాయంటే అర్ధం చేసుకోవచ్చు అఖండకు తమన్‌ ఎంత వర్క్ చేసాడో. థియేటర్లను శివ నామ స్మరణతో మోత మోగించాడు తమన్‌.

కాగా అఖండ కు సిక్వెల్ అఖండ-2 (#BB 4)ను తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు బోయపాటి. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తమన్‌ అఖండ -2కు ప్రాజెక్ట్ కు వర్క్ చేయట్లేదని తెలుస్తోంది. స్కంధ మ్యూజిక్ విషయమై బోయపాటి, తమన్‌ మధ్య మనస్పర్థలు వచ్చాయని వాటి కారణంగా అఖండ-2 కు వీరు కలిసి పనిచేయట్లేదని టాక్. ఇటీవల అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సిక్వెల్ కు సంగీతం అందించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బోయపాటి క్లారిటీ ఇసాడేమో చూడాలి.

 

Also Read : Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..

Exit mobile version