NTV Telugu Site icon

Harsha Sai : ఎట్టకేలకు హైదరాబద్ కు యూట్యూబర్ హర్ష సాయి..

Harsha Sai

Harsha Sai

సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల రూపాయల డబ్బు  తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ పేరుతొ గెస్ట్ హౌస్ కు పిలిచి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి  తనపై అత్యాచారం  చేసి,  ఆ సంఘటనను వీడియోగా  రికార్డు చేసి, నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే హర్ష సాయి పరారయ్యాడు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు ఇవే

గతకొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ” ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ పని పూర్తి చేసుకుని నేడు తిరిగి హైదరాబాద్ వచ్చాను. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది. నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా కావాలని నన్ను ప్రజలలో చులకన చేయడానికి నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారు. కానీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాను” అని అన్నారు.

 

Show comments