Site icon NTV Telugu

పద్మా పాటిల్ : ‘హ్యారీ పాటర్’లో అమ్మాయి… ఇప్పుడు అమ్మ!

Harry Potter actress Afshan Azad becomes mother

‘హ్యారీ పాటర్’ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. మొత్తం 8 చిత్రాలతో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, ‘హ్యారీ పాటర్’ సిరీస్ లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గుర్తుకు ఉన్నారా? భారతీయ మూలాలున్న అమ్మాయిలుగా సినిమాలో వారి పాత్రల్ని చూపిస్తారు. అయితే, రియల్ లైఫ్లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గా నటించిన అఫ్సాన్ ఆజాద్, షెఫాలీ చౌదరీ ఇండియన్స్ కాదు. బంగ్లాదేశీ మూలాలున్న బ్రిటీష్ బ్యూటీస్!

Read Also : ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!

‘హ్యారీ పాటర్’ మూవీస్ లో పద్మా పాటిల్ గా నటించిన అఫ్సాన్ ఆజాద్ తన ఆన్ లైన్ ఫ్యామిలీకి గుడ్ న్యూస్ తెలిపింది. కూతురు పుట్టిందంటూ తీపి కబురు ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. తల్లి కావటం అద్భుతంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే, త్వరలోనే తిరిగి వస్తానంటూ ప్రస్తుతానికి సెలవు ప్రకటించేసింది.

విద్యార్థిగా ఉండగానే ‘హ్యారీ పాటర్’ చిత్రంలో పద్మా పాటిల్ పాత్రకు ఎంపికైన అఫ్సాన్ ఆజాద్… నబిల్ ఖాజీని పెళ్లాడింది. 2018లో మిస్ అఫ్సాన్ ఆజాద్ మిసెస్ అఫ్సాన్ ఖాజీగా మారగా… 2021 జూలైలో చిట్టి తల్లికి తల్లైంది! అధికారికంగా గుడ్ న్యూస్ ని 27వ తేదీన సొషల్ మీడియాలో పంచుకుంది!

View this post on Instagram

A post shared by Official Afshan (@afshanazad)

Exit mobile version