NTV Telugu Site icon

Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..

Untitled Design (31)

Untitled Design (31)

టాలీవుడ్ న‌టుడు సుధీర్‌బాబుప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన‌ ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా న‌టించింది. సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ఓటీటీ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

.కాగా ఇటీవల తండ్రీకూతుళ్ల బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్ర‌ణీత్ హ‌నుమంతు ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో నటించడంతో ప్రణీత్ సీన్స్ క‌ట్ చేసి ట్రిమ్ చేసిన వర్షన్ స్ట్రీమింగ్ చేసారు. ఈటీవీ విన్‌, ఆహా. రెండు రోజుల గ్యాప్ తరువాత హరోంహర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా ప్రైమ్ లో ఈ చిత్రం ఇండియా నం.1గా ట్రేండింగ్ అవుతోంది. “హరోమ్ హరా” అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.థియేటర్లలో ఆకట్టుకొని ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని మిలియన్ వ్యూస్ రాబట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతూ మరిన్ని రికార్డులు సాధించే దిశగా సాగుతోంది హరోం హర.

 

Also Read: Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?

Show comments