NTV Telugu Site icon

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్.

Ustaadh Bhagath Singh

Ustaadh Bhagath Singh

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గబ్బర్ సింగ్ ” ఘన విజయం సాధించింది.అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో వున్న పవన్ కల్యాణ్ కు గబ్బర్ సింగ్ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ సాలిడ్ హిట్ అందించారు.ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో “ఉస్తాద్ భగత్ సింగ్ ” అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

Read Also :Harish Shankar : తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఇప్పటీకే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పవన్ రాజకీయాలలో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది.ఇదిలా ఉంటే జూన్ 14 హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసి శ్రీలీల కు బర్త్ డే విషెస్ చెప్పి త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలు పెడదాం అని తెలిపారు.ఈ స్టిల్ లో ఉయ్యాల మీద కూర్చున్న శ్రీలీలకు డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఉయ్యాల వెనుకే పవన్ కల్యాణ్ నుంచుని వున్నారు.ప్రస్తుతం ఈ స్టిల్ బాగా వైరల్ అవుతుంది.

Show comments