పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఇప్ప్పటికే అనేక వాయిదాలు, వివాదాల అనంతరం మొత్తానికి జూలై 24న విడుదల కానుంది ‘హరి హర వీరమల్లు’. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. ఫ్యాన్స్ కు మరింత జోష్ పెంచేందుకు నేడు హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు సాయంత్రం 6 గంటలకు శిల్ప కళావేదికలో నిర్వహిస్తున్నారు.
కాని అంతంకంటే ముందుగా ఈ ఉదయం 10 గంటలకు పవర్ స్టార్ పవన కళ్యాణ్ మీడియాతో ముచ్చటించనున్నారు. ఈ మీడియా మీట్ చాలా ఉత్కంఠగా సాగబోతోంది. పవర్ స్టార్ నిన్న హరిహర వీరమల్లు ఫైనల్ కాపీ చూసారు. కంటెంట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. టీమ్ కు తన విషెష్ కూడా తెలిపారు. ఆ సంతోషంలోనే మీడియతో సినిమా విశేషాలతో పాటు థియేటర్స్ బంద్ విషయంలో నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో మీటింగ్ రద్దు విషయంపై కూడా మీడియా నుండి ప్రశ్నలు ఉండబోతున్నాయట. అలాగే పుష్ప 2 రిలీజ్ రోజు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లు ప్రీమియర్స్ కు ఎటుంవంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారు. అలాగే నేడు సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ఈవెంట్ లో కూడా పవన్ స్పీచ్ స్పెషల్ గా ఉండబోతుంది.
