పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఆగమనానికి మరెంతో టైమ్ లేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఏంటి ఎలా ఉందని ఈలోగానే కొందరు ఆరాలు స్టార్ట్ చేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు టాక్ ఎలా ఉందంటే..
Also Read : HHVM : హరిహర వీరమల్లుపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్.. మాస్ పవర్
క్రిష్ జాగర్లమూడి రాసిన ఈ సినిమా కథ చాలా బాగుందట. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ కథను క్రిష్ అలాగే ఏ ఎం జ్యోతికృష్ణ అద్భుతంగా తెరకెక్కించారట. పవర్ స్టార్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుందని టాక్. అయితే సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండడం వలన పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నారని అక్కడ కాస్త స్లో అవుతుందని, యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా ఉంటయట. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఫస్టాఫ్ కాస్త స్లో గా ఒక ఫ్లోలో వెళుతుందట. ఇక అసలు కథ సెకాండాఫ్ లో స్టార్ట్ అవుతుందట. ప్రతి బ్లాక్ ఫ్యాన్స్ కు గూస్ బమ్స్ ఇస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ తో చాలా బాగా చేసాడని, ఎలివేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. VFX ను మరింత మెరుగు చేసి ఉంటె బాగుంటుంది అనే టాక్ వినిపిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఫ్యాన్స్ కు పవర్ స్టార్ ప్యూర్ ఫ్యాన్స్ స్టఫ్ ఇవ్వబోతున్నాడని సమాచారం అందుతోంది. మరి హరహర ఎలా ఉండబోతున్నాడు అనేది మరికొన్ని గంటల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.
