పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.
Samantha: హే సామ్.. ఏంటి ఇలా తయారయ్యావ్?
ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. అయితే నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ ని మార్చి 28న రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని చెప్పిన డేటుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.