Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. ఇదే ఫిక్స్

Hhvm

Hhvm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Prabhas : సంక్రాంతికి రాజాసాబ్.. ప్రభాస్ కు తెలుసో లేదో.?

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం ఈ నెల 21 డేట్ ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై అనేక పేర్లు వినిపించాయి. మొదట ఆంధ్రలో వైజాగ్ లో నిర్వహించాహాలని ఆలోచనలు చేశారు. తీరా అక్కడ అనుకోని కారాణాల వలన కుదరడలేదట. ఇలా అనేక తర్జన భర్జనల అనంతరం వేదికను ఫిక్స్ చేసారు. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫిక్స్ చేసారు మేకర్స్. అందుకోసం అనుమతులు కూడా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు అనుగుణంగా ఈవెంట్ ను శిల్ప కళావేదికలో ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version