Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు గ్రాండ్ సక్సెస్ మీట్.. ఎప్పడు.. ఎక్కడంటే

Hhvm (6)

Hhvm (6)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన లబిస్తోంది. తనదైన నేపధ్య సంగీతంతో హరిహర వీరమల్లుకు మరింత పవర్ అందించారు.

Also Read : HHVM : పవన్ కళ్యాణ్ ని ‘పవర్ స్టార్’ అని ఎందుకు అంటారో తెలుసా

గత రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన హరహర వీరమల్లుకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందని ప్రకటించారు. అందుకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఆ సంతోషాన్ని ఆడియెన్స్ తో షేర్ చేసుకునేందుకు మేకర్స్ హరిహర గ్రాండ్ సక్సెస్ పేరుతో మీడియా మీట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో జరిగే ఈ ప్రెస్ మీట్ కు చిత్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు జ్యోతి కృష్ణ  మరియు ఇతర యూనిట్ సభ్యులు మొత్తం పాల్గొనే అవకాశం ఉంది.  లాంగ్ గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా కోసం నిర్మాత ఏ ఎం రత్నం ఎన్నో వ్యయప్రయసలు కూర్చి అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ చేసారు. ఆయన ప్రయత్నాన్ని తప్పక మెచ్చుకుని తీరాలి. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతమైన పర్ఫెమెన్స్ కు అంతే రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి.

Exit mobile version