పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. ఏ ఎం జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించారు. మూడు రోజుల క్రితం థియేటర్స్ లో అడుగుపెటట్టిన హరిహర వీరమల్లు మిక్డ్స్ రెస్పాన్స్ రాబట్టింది. ఏపీలోను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ నంబర్ గ్రాస్ తో స్టార్ట్ చేసాడు వీరమల్లు.
Also Read : VD : తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ
కాగా నేడు ఈ సినిమాను ఏపీలోని పలు ఏరియాలలో ఉచిత ప్రదర్శనలు చేయబోతున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ సినిమాను తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ అద్వర్యంలో రాజానగరం నియోజవర్గంలోని మూడు మండలాలలో ప్రభుత్వ స్కూల్, కాలేజీలలో చదివే 9,10, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థును నేడు సీతానగరంలోని గీత సినిమాస్ లో ఉచితంగా హరిహర వీరమల్లు సినిమాను ప్రదర్శించనున్నారు. అలాగే కోరుకొండలోని రామకృష్ణ థియేటర్ లో కూడా ఈ ఉచిత ప్రదర్శనలు చేయనున్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి వంటి విషయాలను ఈ తరం విద్యార్థులకు తెలియాజేయాలని ఉద్దేశంతో హరిహర వీరమల్లును విద్యార్థులకు చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రాజానగరంతో పాటు మరికొన్ని ఏరియాలలో కూడా నేడు హరిహర వీరమల్లును ఫ్రీ షోస్ వేయనున్నారు. ఈ నెల 24న విడుదలైన వీరమల్లు పవర్ స్టార్ తొలిసారి డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన తొలిసినిమా కావడం విశేషం.
