Site icon NTV Telugu

Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..

Hari Hara Viramalu

Hari Hara Viramalu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి  ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లతో మాస్‌లో హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే, మరోవైపు కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి..

Also Read : Renu Desai : మళ్లి పెళ్లి చేసుకుంటా.. పిల్లలే నన్ను ప్రోత్సహిస్తున్నారు..

అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘హరి హర వీరమల్లు’ అనే పాత్ర తెలంగాణ ప్రాంత యోధుడు పండుగ సాయన్న ఆధారంగా రూపొందించారని, కానీ చిత్రబృందం ఇది వెల్లడించకుండా దాచి పెడుతోందని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీరమల్లు పాత్ర వ్యక్తిత్వం, పోరాట ధోరణి, చరిత్రలో చెప్పబడే కొన్ని అంశాలు పండుగ సాయన్న జీవితం‌తో పోలుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కథాసూచన ఎవరి ఆధారంగా తీసుకున్నారు?’ అని చిత్ర యూనిట్‌ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వివాదం వేగంగా పాకుతోంది. ఇదే విధంగా కొనసాగితే సినిమా విడుదలకు ముందు మళ్లీ కొత్త వివాదంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, బహుజన వర్గాల మద్దతు వంటి అంశాల దృష్ట్యా ఓ ప్రత్యేక వేదికగా మారింది. ఇప్పుడు ఈ వివాదం కూడా ఓ కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. మని చిత్ర బృందం ఈ వివాదానికి సరైన సమాధానం ఇస్తుందా? లేదా ప్రచారం తప్ప ఆ అంశాన్ని దాటి వెళ్లిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Exit mobile version