హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్న మంగళగిరిలో మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి విశాఖపట్నంలో ఒక ఈవెంట్‌లో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
Also Read:Dacoit: అడవిశేష్, మృణాల్ ఠాకూర్లకు గాయాలు?
నిజానికి ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అవుతుంది. అయితే, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సంధ్య థియేటర్ బయట పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున బ్యానర్‌లు కట్టారు అక్కడి అభిమానులు. అయితే, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు అక్కడికి చేరుకుని బ్యానర్‌లు తెలుగులో ఉన్నాయని , కన్నడలో లేవని ఆరోపిస్తూ కట్టిన బ్యానర్‌లను తొలగించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత కొద్దిరోజులుగా కర్ణాటక రాష్ట్రంలో ఇతర భాషల బోర్డులు కనిపిస్తే కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు వెంటనే వాటిని తొలగిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమా బ్యానర్‌ని కూడా తొలగించడం చర్చనీయ అంశమైంది.
