Site icon NTV Telugu

Hari Hara Veera Mallu : వీరమల్లు నుంచి ‘ఎవరది ఎవరది.. కొత్త పాట

Hari Hara Veera Mallu New Song 'evaradi Evaradi'

Hari Hara Veera Mallu New Song 'evaradi Evaradi'

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగుతుంది. ఓ రహస్య మయమైన, పోరాటమే జీవితం అయిన నాయకుడి కథను చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్, పట్టు పట్టే లిరిక్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ అందరికీ గూస్‌బంప్స్ కలిగిస్తోంది.

Also Read : Bad Girl : ఎట్టకేలకు ‘బ్యాడ్ గర్ల్’ కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్!

ముఖ్యంగా “ఎవరది ఎవరది..అతగాడో పొడుపు కథ..దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ..” అంటూ సాగుతూ పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమా మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైంది. అయితే, వివిధ కారణాలతో మిగిలిన భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.

Exit mobile version