Site icon NTV Telugu

Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్‌టైం ఇదేనా?

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లనుండగా, అక్కడి నుండి ఇంకా స్పష్టమైన సమాచారం రానుంది.

Also Read : Alia Bhatt : అలియా భట్‌కి రూ.76 లక్షల మోసం – మాజీ పీఏ వేదిక శెట్టి అరెస్ట్!

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ మాస్ట్రో ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ జంట స్క్రీన్ పై ఎలా కన్పిస్తారో అనే విషయంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ సమీపించనుండటంతో త్వరలోనే ప్రమోషన్ల వేగం పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version