NTV Telugu Site icon

Hardik- Natasha : హార్దిక్ పాండ్యా- నటాషా అందుకే విడిపోయారు.. రహస్యం బయటపడిందిగా!

Hardik Pandya

Hardik Pandya

మే 2020లో పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ గత జూలై 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అసలు ఎందుకు విడిపోయింది? అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటాషా స్టాంకోవిచ్ – హార్దిక్ పాండ్యా ఇటీవల పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు, ఈ జంట ఎందుకు విడిపోయారో మొదటిసారి కుటుంబ సభ్యుడు ఒకరు వెల్లడించారు. నటాషా ఇష్టం వచ్చినట్లు ఉండటాన్ని హార్దిక్ పాండ్యా తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. నటాషా తనకు ఇష్టం వచ్చినట్లుగానే ఉండాలని కోరుకున్నారు. ఈ అంశం పాండ్యా-నటాషాల పెళ్లిలో చిచ్చు రేపింది. హార్దిక్ ప్రవర్తనతో కుటుంబానికి సన్నిహితంగా ఉండే మరో వ్యక్తి వలన నటాషా కూడా విసిగిపోయిందని తెలుస్తోంది.

Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?

ఇద్దరికీ మేలు జరగాలంటే విడిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజానికి హార్దిక్ పాండ్యా దూకుడు వ్యక్తిత్వం కలవాడు. అతనితో జీవించడం బోరింగ్‌గా మారడంతో పాండ్యాతో నటాషా కొనసాగలేకపోయిందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియా పోర్టల్ తెలిపింది. నటాషా హార్దిక్ పాండ్యా ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి చాలాసార్లు చర్చించింది. కానీ అతను మారకపోవడంతో విడాకులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక నటాషా సన్నిహితురాలు మాట్లాడుతూ, ఇది కఠినమైనది అయినప్పటికీ, అతను అనివార్యంగా విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ఇక విడాకుల వార్తను ప్రకటిస్తూ, ఇది ‘కఠినమైన నిర్ణయం’ అని మరియు తమ బిడ్డ అగస్త్యకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతానని ఈ జంట ప్రకటించింది.

Show comments