Happy Journey : ఆమెజాన్ ప్రైంలో ఆకట్టుకుంటున్న ‘హ్యాపీ జర్నీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఒక సినిమాకు ఐఎండీబీలో (IMDb) 8 లేదా 9 రేటింగ్ వస్తేనే అదొక ఇంటర్నేషనల్ మాస్టర్ పీస్ అని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. అలాంటిది ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన ఓ సినిమా ఏకంగా 9.7/10 రేటింగ్ కొల్లగొట్టి డిజిటల్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో సందడి చేసి ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా విడుదలై, ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చిన ఆ చిత్రమే ‘హ్యాపీ జర్నీ’. కేవలం ఐఎండీబీలోనే కాదు.. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో కూడా ఏకంగా 9.5 రేటింగ్‌తో ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేంజ్ రేటింగ్స్ చూసి అసలు ఈ సినిమాలో ఏముందా అని సినీ అభిమానులు ప్రైమ్ వీడియోలో ఎగబడి మరీ చూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన ఎన్నో అద్భుతమైన కథలకు ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. తాజాగా ‘హ్యాపీ జర్నీ’ విషయంలోనూ అదే జరుగుతోంది.
“కొన్ని ప్రయాణాలు మన ప్రణాళికలను మారుస్తాయి.. కానీ మరికొన్ని ప్రయాణాలు ఏకంగా మన జీవితాలనే మార్చేస్తాయి” అనే ఓ అద్భుతమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కథలోని సహజత్వం, ఆద్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లే, పాత్రలు పలికించిన భావోద్వేగాలు నేరుగా గుండెలకు కనెక్ట్ కావడంతో వ్యూయర్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు సంయుక్తంగా అత్యంత రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ రెడ్డి, శైలేంద్ర కుమార్, రాజేష్ వ్రజ్లాల్ వసాని, సలోని జయ్ వసాని, అవిషా గోస్వామి తదితరులు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక సాంకేతికంగానూ ఈ చిత్రం చాలా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. టాలీవుడ్ బడా సినిమాలకు పనిచేసే ప్రముఖ టెక్నీషియన్లు ఈ మూవీకి వర్క్ చేయడం విశేషం. మెలోడీ బ్రహ్మ శేఖర్ చంద్ర అందించిన సంగీతం, టాలెంటెడ్ టెక్నీషియన్ బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్, చోటా కె ప్రసాద్ షార్ప్ ఎడిటింగ్ ఈ సినిమాను విజువల్ గా మరో స్థాయికి తీసుకెళ్లాయి. మణికందన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం ప్రేక్షకులను నిజంగానే ఆ జర్నీలో భాగం చేసేలా ఉంది. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే శ్రోతల నుంచి విశేష ఆదరణ పొందుతుండగా.. వంశీ-శేఖర్, అనిల్ అండ్ భాను ప్రమోషనల్ వర్క్ ఈ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఓ స్వచ్ఛమైన సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్‌లోని ‘హ్యాపీ జర్నీ’ బెస్ట్ ఛాయిస్ అని రికార్డ్ స్థాయి రేటింగ్స్ చెబుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
-
Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..