HanuMan: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HanuMan First Review is out: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తన ఊరి కోసం ఆ యువకుడు ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున బుకింగ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది హిందీ ఫిలిం క్రిటిక్ ట్రేడ్ అనలిస్ట్ తరం ఆదర్శ్ ఈ సినిమా చూసి బాగుందని చెబుతూ వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. హనుమాన్ ఫాసినేటింగ్ అంటూ ఆయన పేర్కొనడమే కాదు మూడున్నర రేటింగ్ కూడా ఇచ్చారు.
Vyooham Movie: ఆర్జీవీ వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. రేపు వెలుబడనున్న తీర్పు!
Also Read
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, హనుమాన్ ఎగ్జైటింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో డ్రామా, ఎమోషన్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ మైథాలజీతో సింక్ అయ్యేలా చేశారని ఎన్నో గూస్ బంప్ మూమెంట్స్ కూడా ఉన్నాయని ఎక్స్ట్రార్డినరీ క్లైమాక్స్ ఉందని చెప్పుకొచ్చారు. తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్ వంటి వారు అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ ఒక కీలక పాత్ర పోషించిందని హిందీ డబ్బింగ్ కూడా బాగా కుదిరిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయం గురించి ప్రశాంత్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత చూసిన మొదటి సినిమా తమదేనని సినిమా చూసి తనను అభినందిస్తూ 15 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!